హైదరాబాద్: మాదాపూర్‌లో మరో ఐటీ కంపెనీ మోసం వెలుగులోకి వచ్చింది. ట్రెయినింగ్, ఉద్యోగ అవకాశం పేరుతో నిరుద్యోగుల నుంచి ఎన్‌ఎస్‌ఎన్ ఇన్ఫోటెక్ భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది.
దాదాపు 400 మంది నిరుద్యోగుల దగ్గర ఎన్‌ఎస్ఎన్ ఇన్ఫోటెక్ డబ్బులు వసూలు చేసి ప్లేటు ఫిరాయించింది. శిక్షణతో పాటు ఉద్యోగం ఇస్తామని నమ్మబలికి స్వామి నాయుడు అనే వ్యక్తి తమను మోసం చేశాడని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సైబరాబాద్ కమిషనరేట్‌లోని ఈవోడబ్ల్యూ లో కూడా ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.