హైదరాబాద్: ఫిలిం నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం ప్రవేశద్వారం వద్ద అనధికారంగా నిర్మించిన గార్డు గదిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కూల్చివేసింది. జగన్ భద్రత కోసమే అక్రమ కట్టడాలు కట్టారని అధికారులు చెబుతున్నారు. మాజీ సీఎం జగన్ నివాసం వద్ద కూల్చివేత అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రిగా జగన్ పదవికి రాజీనామా చేసి కొద్ది రోజులే అవుతోంది.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న రెండురోజులకే ఈ సంఘటన జరిగిది. ఇదిగో.. శనివారం ఫిల్మ్ నగర్‌లోని లోటస్ పాండ్ నివాసంలోని గార్డు గదిని బుల్డోజర్ కూల్చివేస్తున్న దృశ్యం.
కాగా.. ఈ నిర్మాణం వల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని.. సామాన్యుల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం జీహెచ్‌ఎంసీ అధికారులు లోటస్‌పాండ్‌లోని గార్డు గదిని కూల్చివేయాలని సిబ్బందికి సమాచారం అందించారు.