అంబులెన్స్‌లో చెలరేగిన మంటలు.. డ్రైవర్‌ మృతి

హైదరాబాద్‌ నగరంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురం దగ్గర ఓ ప్రైవేట్‌ అంబులెన్స్‌ ప్రమాదానికి గురైంది.

By అంజి  Published on  25 July 2023 8:07 AM IST
Ambulance, Hyderabad, driver killed

అంబులెన్స్‌లో చెలరేగిన మంటలు.. డ్రైవర్‌ మృతి

హైదరాబాద్‌ నగరంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురం దగ్గర ఓ ప్రైవేట్‌ అంబులెన్స్‌ ప్రమాదానికి గురైంది. అంబులెన్స్‌ బోల్తా పడింది.. ఆ తర్వాత మంటల్లో దగ్ధమైంది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన అంబులెన్స్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మలక్‌పేటకు చెందిన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి అంబులెన్స్‌ బీఎన్‌రెడ్డి హస్తినాపురం దగ్గర డివైడర్‌ని ఢీకొని పల్టీలు కొట్టింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో ఉన్న డ్రైవర్‌ని బయటకు తీశారు.

అయితే.. తీవ్ర గాయల పాలైన అంబులెన్స్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత స్థానికులు బోల్తా పడిన అంబులెన్స్‌ పైకి లేపే ప్రయత్నం చేస్తుండగా ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో మంటల ధాటికి అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. మలక్ పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుండి పేషెంట్‌ను ఇబ్రహీంపట్నంలో దింపి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దగ్ధమైన వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు.

Next Story