హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ మార్గాలు మూసివేత‌

Ambedkar Secretariat inauguration Check traffic diversions in Hyderabad. తెలంగాణ ప్రభుత్వ నూతన సచివాలయం ఏప్రిల్ 30వ తేదీ ఆదివారం నాడు ప్రారంభం కానుంది.

By M.S.R  Published on  29 April 2023 12:15 PM GMT
హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ మార్గాలు మూసివేత‌

తెలంగాణ ప్రభుత్వ నూతన సచివాలయం ఏప్రిల్ 30వ తేదీ ఆదివారం నాడు ప్రారంభం కానుంది. నగరంలో ఆదివారం నాడు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. హుస్సేన్ సాగర్‌‌, సైఫాబాద్‌, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని అధికారులు సూచించారు. ఎన్టీఆర్ గార్డెన్స్, ఎన్టీఆర్ ఘాట్, లుంబనీ పార్క్‌, నెక్లెస్‌ రోడ్డును పూర్తిగా మూసి వేస్తున్నట్టు తెలిపారు. వీఐపీల రాకపోకలను బట్టి పీవీ విగ్రహం, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగు తల్లి జంక్షన్‌ వరకు ఇరువైపుల అప్పటి పరిస్థితులను బట్టి ట్రాఫిక్‌ను నిలిపివేయడం, మళ్లింపులు జరగనున్నాయి. ఆదివారం ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీ పార్కులు మూసివేయనున్నారు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి వాహనాలకు అనుమతి లేదన్నారు. ట్యాంక్‌బండ్‌, తెలుగుతల్లి, బీఆర్‌‌కే భవన్‌ నుంచి ఎన్‌టీఆర్‌‌ మార్గ్‌ రూట్‌లో వాహనాలకు ఎంట్రీ లేదని తెలిపారు. ఆహ్వానితుల కోసం పార్కింగ్‌ స్థలాలు కేటాయించామని, సచివాలయానికి వచ్చే ఆహ్వానితులు తమ పాస్‌లను కార్లకు అతికించుకోవాలని సూచించారు అధికారులు.

- వీవీ విగ్ర‌హం – నెక్లెస్ రోట‌రీ – ఎన్టీఆర్ మార్గ్ మ‌ధ్య వాహ‌నాల‌కు అనుమ‌తి లేదు. తెలుగు త‌ల్లి జంక్ష‌న్‌ను మూసివేయ‌నున్నారు.

- ఖైర‌తాబాద్, పంజాగుట్ట‌, సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోట‌రీ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను వీవీ విగ్ర‌హం వ‌ద్ద షాదాన్, నిరంకారి భ‌వ‌నం వైపు మ‌ళ్లిస్తారు.

- నిరంకారి, చింత‌ల్ బ‌స్తీ నుంచి నెక్లెస్ రోట‌రీ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను అనుమ‌తి లేదు. ఖైర‌తాబాద్ ఫ్లై ఓవ‌ర్‌ను మూసివేయ‌నున్నారు.

- ఇక్బాల్ మినార్ జంక్ష‌న్ నుంచి ట్యాంక్ బండ్‌, రాణిగంజ్ వైపు వెళ్లే వాహ‌న‌దారులు తెలుగు త‌ల్లి ఫ్లై ఓవ‌ర్ మీదుగా లోయ‌ర్ ట్యాంక్ బండ్ చేరుకోవాల్సి ఉంటుంది.

-బడా గ‌ణేశ్ లేన్ నుంచి ఐమాక్స్, నెక్లెస్ రోట‌రి నుంచి వైపు వ‌చ్చే వాహ‌నాల‌కు అనుమ‌తి లేదు. ఈ వాహ‌నాల‌ను బ‌డా గ‌ణేశ్ లేన్ నుంచి రాజ్‌ధూత్ లేన్ వైపున‌కు మ‌ళ్లించ‌నున్నారు.

-ట్యాంక్ బండ్, తెలుగు త‌ల్లి జంక్ష‌న్ వైపు వ‌చ్చే ట్రాఫిక్‌ను ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమ‌తించ‌రు. ఇక్బాల్ మినార్ వైపు మ‌ళ్లిస్తారు.

-బీఆర్‌కే భ‌వ‌న్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహ‌నాల‌ను తెలుగు త‌ల్లి జంక్ష‌న్ మీదుగా ఇక్బాల్ మినార్ వైపు మ‌ళ్లించ‌నున్నారు.


Next Story