అక్కడకు వెళ్లకూడదంటూ.. అల్లు అర్జున్ కు నోటీసులు

డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన తొమ్మిదేళ్ల శ్రీ తేజ్ చికిత్స పొందుతున్న కిమ్స్ ఆసుపత్రిని సందర్శించవద్దని అల్లు అర్జున్‌కి రాంగోపాల్‌పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు.

By M.S.R  Published on  5 Jan 2025 11:16 AM IST
Allu Arjun, police notice, Sritej, Tollywood, Hyderabad

అక్కడకు వెళ్లకూడదంటూ.. అల్లు అర్జున్ కు నోటీసులు 

డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన తొమ్మిదేళ్ల శ్రీ తేజ్ చికిత్స పొందుతున్న కిమ్స్ ఆసుపత్రిని సందర్శించవద్దని అల్లు అర్జున్‌కి రాంగోపాల్‌పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ నివాసంలో అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి పోలీసులు నోటీసు ఇచ్చారు. పబ్లిక్ ఆర్డర్, భద్రతను కాపాడటానికి ఈ సందర్శనను నివారించాలని సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులు, అవాంతరాల దృష్ట్యా, అల్లు అర్జున్ శ్రీ తేజ్‌ని సందర్శించకపోవడమే ఉత్తమమని నోటీసులో ప్రత్యేకంగా పేర్కొన్నారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి చనిపోగా, ఆమె కొడుకు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ బాలుడిని త్వరలోనే పరామర్శిస్తానంటూ అల్లు అర్జున్ ఇటీవల తెలిపారు. శనివారం నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో శ్రీతేజ్ ను పరామర్శించేందుకు వెళ్తారన్నారు. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు విధించిన షరతులలో భాగంగా అల్లు అర్జున్ ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాల్సి ఉంటుంది. స్టేషన్ లో హాజరు వేయించుకుని రిజిస్టర్ లో సంతకం చేసి వెనుదిరిగారు.

Next Story