శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్‌

సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడి బేగంపేట్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను నటుడు అల్లు అర్జున్‌ పరామర్శించారు.

By అంజి  Published on  7 Jan 2025 10:27 AM IST
Allu Arjun, Sri Tej, Sandhya Theatre Stampede, KIMS Hospital

శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్‌

హైదరాబాద్‌: సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడి బేగంపేట్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను నటుడు అల్లు అర్జున్‌ పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు నిర్మాత దిల్‌రాజు ఆస్పత్రికి వెళ్లారు. కిమ్స్‌కు వెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే రాంగోపాల్‌ పేట్‌ పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

శ్రీతేజ్‌ను పరామర్శించడానికి కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కిమ్స్‌ ఆస్పత్రి వద్ద పటిష్ఠమైన చర్యలు చేపట్టారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆస్పత్రి రహదారుల్లో ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. మరోపక్కన ఇతర రోగులకు ఇబ్బంది కలగకుండా ఆస్పత్రి వర్గాలు సైతం అన్ని ఏర్పాట్లు చేశారు. గత నెల 4న సంథ్య థియేటర్‌లో 'పుష్పా-2' సినిమా స్క్రీనింగ్‌ సమయంలో జరిగిన తొక్కిసలాటలో తల్లి రేవతి చనిపోగా, కుమారుడు శ్రీతేజ్‌ గాయపడ్డాడు.

Next Story