భార్యను హత్తుకుని బన్నీ ఎమోషనల్

అల్లు అర్జున్ కోసం ఫ్యామిలీ అంతా గుమ్మం వద్దే ఎదురుచూస్తూ ఉండిపోయింది.

By Kalasani Durgapraveen  Published on  14 Dec 2024 4:54 AM GMT
భార్యను హత్తుకుని బన్నీ ఎమోషనల్

అల్లు అర్జున్ కోసం ఫ్యామిలీ అంతా గుమ్మం వద్దే ఎదురుచూస్తూ ఉండిపోయింది. గుమ్మడికాయతో దిష్టి తీసి కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ ను ఇంట్లోకి ఆహ్వానించారు. బన్నీ రాకతో అర్హ, అయాన్‌లు పరిగెత్తుకుంటూ వచ్చారు. పాపను ఎత్తుకుని బన్నీ ముద్దాడాడు. అయాన్‌ను దగ్గరకు తీసుకున్నాడు. భార్య స్నేహారెడ్డిని హత్తుకుని అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. అనంత‌రం ఆయ‌న అభిమానుల‌కు అభివాదం చేశారు. ఆ త‌ర్వాత‌ మీడియాతో మాట్లాడారు.

చంచ‌ల్‌గూడ జైలు నుంచి విడుద‌లైన అల్లు అర్జున్ మొద‌ట గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కి వెళ్లారు. అక్క‌డి నుంచి జూబ్లీహిల్స్ లోని త‌న నివాసానికి చేరుకున్నారు.

Next Story