కార్పొరేటర్లకు వార్నింగ్ ఇచ్చిన అక్బరుద్దీన్ ఒవైసీ

Akbaruddin Owaisi Warns Newly Elected MIM Corporators. అక్బరుద్దీన్ ఒవైసీ.. ఎంఐఎం నేత ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్.

By Medi Samrat  Published on  14 Dec 2020 9:34 AM GMT
కార్పొరేటర్లకు వార్నింగ్ ఇచ్చిన అక్బరుద్దీన్ ఒవైసీ

అక్బరుద్దీన్ ఒవైసీ.. ఎంఐఎం నేత ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్. తాజాగా తమ పార్టీల నేతలకే వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలతో హఫీజ్ బాబా నగర్ లోని ఫలక్ ప్యాలస్ ఫంక్షన్ హాల్లో ఎంఐఎం విజయోత్సవ సభను నిర్వహించారు. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన తమ పార్టీ కార్పొరేటర్లకు అక్బరుద్దీన్ ఒవైసీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కార్పొరేటర్ పదవిని అడ్డుపెట్టుకుని వేధింపులకు గురి చేయడం, డబ్బు వసూలు చేయడం వంటి పనులు చేస్తే కాలర్ పట్టుకుని నడి బజారులో నిలబెడతానని హెచ్చరించారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో గెలుపొందిన కార్పొరేటర్లను అక్బరుద్దీన్ ఒవైసీ సన్మానించారు.చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులను కలిగించినా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.

కార్పొరేటర్లుగా ఎన్నికైన అందరూ కూడా ప్రజాసేవ చేయడానికి ఇది దేవుడు ఇచ్చిన అవకాశంగా భావించాలని.. అధికారం ఉంది కదా అని ప్రజలను వేధించొద్దని అన్నారు. డబ్బు వసూళ్లకు పాల్పడినట్టు తెలిస్తే క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చాంద్రాయణగుట్ట ప్రాంతం తన రక్తం చిందిన నేల అని అన్నారు. ఈ ప్రాంతంపై తనకు ఎంతో ప్రేమ, మక్కువ ఉన్నాయని చెప్పారు.


Next Story