ఎమ్మెల్యేగా తన ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించినందుకు గాను గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్‌ను రాష్ట్ర శాసనసభ నుండి బహిష్కరించాలని ఎంఐఎం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఏఐఎంఐఎం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా క్వాద్రీ మాట్లాడుతూ.. రాజాసింగ్ ప్రవర్తన శాసన సభ సభ్యునిగా తగదని, సభ అధికారాలను ఉల్లంఘించిందని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యల వల్ల శాసనసభ గౌరవం తగ్గిందని ఆరోపించారు.
మహ్మద్ ప్రవక్త, ఇస్లాంకు వ్యతిరేకంగా రాజా సింగ్ చేసిన ప్రకటన భారతదేశంలోని ముస్లింల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని.. ఇది ఎమ్మెల్యేగా ఆయన చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించిందని ఎంఐఎం పేర్కొంది. రాజా సింగ్ పదేపదే హింసను ప్రేరేపించాడు. ముస్లింలపై శత్రుత్వం, ద్వేషం, దుష్ప్రవర్తనను ప్రోత్సహించాడు. ఆ విధంగా.. అతను భారతదేశ సమగ్రతను సమర్థిస్తానని తన ప్రమాణాన్ని కూడా ఉల్లంఘించాడు" అని AIMIM ఫిర్యాదు చేసింది.
దురుసుగా ప్రవర్తించినందుకు బీజేపీ రాజా సింగ్‌ను ఈ ఏడాది ప్రారంభంలో సభ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా పార్టీ గుర్తు చేసింది. అందువల్ల.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రకారం అధికారాన్ని ఉల్లంఘించినందుకు, సభను ధిక్కరించినందుకు AIMIM అతనిపై చర్య తీసుకోవాలని కోరింది.