భూకబ్జాదారుల నుండి హైదరాబాద్‌లో ఎన్నో విలువైన భూములను కాపాడిన న్యాయవాది
Advocate Srinivas Rangachary who saved valuable Hyderabad lands passes away.ఆసూరి మరింగంటి శ్రీనివాస రంగాచార్య
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Feb 2023 11:31 AM IST![భూకబ్జాదారుల నుండి హైదరాబాద్‌లో ఎన్నో విలువైన భూములను కాపాడిన న్యాయవాది భూకబ్జాదారుల నుండి హైదరాబాద్‌లో ఎన్నో విలువైన భూములను కాపాడిన న్యాయవాది](https://telugu.newsmeter.in/h-upload/2023/02/14/339252-untitled-1-copy.webp)
ప్రముఖ న్యాయవాది ఆసూరి మరింగంటి శ్రీనివాస రంగాచార్య తుది శ్వాస విడిచారు. ఆయన ఫిబ్రవరి 11 న హైదరాబాద్‌లోని తన నివాసంలో మరణించారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ తరపున ఎన్నో కేసుల్లో ఆయన వాదన వినిపించారు. పలు భూములు ఇతరుల చెంతకు వెళ్లకుండా పోరాడారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన సోదరి రంగనాయకమ్మ (ఎం రాజగోపాలాచారి - మాడభూషి శ్రీధర్‌ల తల్లి) 14 రోజుల క్రితమే తుదిశ్వాస విడిచారు.
న్యాయవాదిగా శ్రీనివాస రంగాచార్య భూకబ్జాదారులను అడ్డుకున్నారు. హైదరాబాద్‌లో చాలా విలువైన భూములను కాపాడారు. శ్రీనివాస రంగాచార్య MCH, ఆంధ్రాబ్యాంక్‌లకు ఎంతో నమ్మకంగా పని చేశారు. ఆయన తన సోదరుడు వేదాంతాచారితో కలిసి హైదరాబాద్‌లోని చంద్రాయణగట్ట, కేశవగిరిలోని శ్రీ చెన్న కేశవ స్వామి ఆలయానికి వ్యవస్థాపక ధర్మకర్తగా ఉన్నారు.
మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. ‘రంగక్కయ్య’ (93 ఏళ్లు) తర్వాత 14 రోజుల్లోనే ఆసూరి మరింగంటి శ్రీనివాస రంగాచారి మా అమ్మను అనుసరించారు. ఆయన గొప్ప వ్యక్తి. సమర్థవంతమైన న్యాయవాది. తిరుప్పావైపై పండిట్, ఎంతో భక్తి ఉన్న వ్యక్తి . ప్రతి ధనుర్మాసంలో సికింద్రాబాద్‌లోని కీస్ హైస్కూల్‌లో తిరుప్పావై ప్రవచనం వినేందుకు రంగక్కయ్యను, ఆయన సోదరుడిని, నన్ను, తనతో పాటు వచ్చే వారందరినీ తన కారులో తీసుకెళ్లేవాడని గుర్తు చేసుకున్నారు.
శ్రీధర్ ఆయన గురించి మరింత వివరిస్తూ.. “నేను లా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఆయన చాలా స్పీడ్‌తో కేసుల డ్రాఫ్టింగ్‌ను డిక్టేట్ చేసేవారు. అది ఇతరులకు నిర్వహించడం కష్టం. కానీ ఎంతో సునాయాసంగా ఆయన అనుకున్నవి చేసేవారు" అని తెలిపారు. ఆయన నుండి లా చేస్తున్న సమయంలో చాలా విషయాలను నేను నేర్చుకున్నానని శ్రీధర్ తెలిపారు. ఆయన దగ్గర నేర్చుకున్నాను కాబట్టే.. ఢిల్లీలో RTI కేంద్ర సమాచార కమిషనర్‌గా 25,000 తీర్పులు వ్రాసానని శ్రీధర్ అన్నారు. న్యాయవాదిగా ఎన్నో సంక్లిష్టమైన ప్రాపర్టీ సమస్యలను ఆయనకు నాకు వివరించేవారని మాడభూషి శ్రీధర్ చెప్పుకొచ్చారు. ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామని శ్రీధర్ చెప్పారు. పలువురు ప్రముఖులు శ్రీనివాస రంగాచార్యకు నివాళులు అర్పించారు.