Hyderabad: శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌పై రోడ్డుప్రమాదం, ఇద్దరు మృతి
హైదరాబాద్ శామీర్‌పేటలోని ఓఆర్‌ఆర్‌పై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 9:37 AM ISTHyderabad: శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌పై రోడ్డుప్రమాదం, ఇద్దరు మృతి
హైదరాబాద్ శామీర్‌పేటలోని ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నారు కొందరు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి తమ ప్రాణాలనే కాదు.. ఎదురువారి జీవితాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు. తాజాగా హైదరాబాద్ శామీర్‌పేటలో రోడ్డుప్రమాదం సంభవించింది. ఒక ఇన్నోవా కారు మితిమీరిన వేగంతో దూసుకొని వచ్చి ఓఆర్ఆర్ పైన ఆగి ఉన్న లారీని వెనక నుండి ఢీ కొట్టింది. కారు అత్యంత వేగంగా రావడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మృతులు డ్రైవర్ మారుతి, ప్రయాణికుడు రాజుగా పోలీసులు గుర్తించారు. మృతులు కుత్బుల్లాపూర్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
ఇన్నోవా కారులో కీసర నుండి మేడ్చల్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసు కుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన ఇద్దరిని స్థానిక హాస్పిటల్ కి తరలించారు. కానీ వారి పరిస్థితి విషమం గా ఉందని వైద్యులు సూచించడంతో వెంటనే మెరుగైన చికిత్స కోసం వారిని ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు. చనిపోయినవారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు పోలీసులు. కాగా ఈ రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేసిన శామీర్‌పేట పోలీసులు.. ప్రమాదం జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరిస్తున్నారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు కూడా ప్రాథమికంగా చెబుతున్నారు.