హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఎల్బీనగర్ ఏరియాలోని ఓ హోటల్‌లో మట్టి దిబ్బలు కూలిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా మృతులు బీహార్‌కు చెందిన వారని సమాచారం.
కొంతమంది కూలీలు కలిసి ఎల్బీనగర్‌లోని ఓ సెల్లార్ లోపల తవ్వకాల పని కోసం వచ్చారు. అందరూ కలిసి మాట్లాడుకుంటూ పని మొదలు పెట్టారు. అయితే తవ్వకాల పని చేస్తుండగా పైనుండి ఒక్కసారిగా మట్టి దిమ్మలు కూలి అక్కడ పని చేస్తున్న వ్యక్తులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారం తో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఒక మృత దేహాన్ని ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులు వెలికి తీశారు. మృతి చెందిన ముగ్గురు బీహార్ కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఇంకా రెండు మృతదేహాలను వెలికి తీసేందుకు ఫైర్ సిబ్బంది, పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఒకరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పి టల్ కి తరలిం చారు. అలాగే తీవ్ర గాయాలైన పలువురిని కామినేని హాస్పిటల్ కి తరలించారు.. కూలీలు మరణించిన విషయం తెలియగానే వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.