హైదరాబాద్: బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడే నిద్రిస్తున్న ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలిపెట్టి అందులో ఉన్నవారు పారిపోయారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంబర్ ప్లేట్ ఆధారంగా కారు యజమానిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.