పండుగ రోజు భారీ అగ్ని ప్రమాదాలు.. దీపాం వెలిగిస్తుండగా..

దీపావళి రోజు హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. మల్కాజ్‌గిరిలో దీపం వెలిగిస్తుండగా భార్య చీరకు నిప్పు అంటుకుంది.

By అంజి  Published on  13 Nov 2023 6:51 AM IST
fire accidents, Hyderabad, Diwali

 పండుగ రోజు భారీ అగ్ని ప్రమాదాలు.. దీపాం వెలిగిస్తుండగా..

దీపావళి రోజు హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. జీడిమెట్ల పీఎస్‌ పరిధిలోని పైప్‌ లైన్‌ రోడ్డులో గల ఓ కెమికల్‌ గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు జీడిమెట్ల ఫైర్‌ సిబ్బందికి తీవ్ర అస్వస్థత. గాయాలయ్యాయి. హుటహుటిన స్థాని మెడివిజన్‌ ఆస్పత్రికి వారిని తరలించారు. ప్రస్తుతం ఫైర్‌ సిబ్బంది చికిత్స పొందుతున్నారు. శ్వాసకోశ, కళ్లమంటలతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.

మల్కాజ్‌గిరిలో దీపం వెలిగిస్తుండగా భార్య చీరకు నిప్పు అంటుకుంది. ఆమెను కాపాడే క్రమంలో భర్త మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. నార్సింగిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఫుడ్‌ కోర్టుకు వ్యాపించాయి. పాతబస్తీలోని ఎలక్ట్రానిక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శాలిబండలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో ప్రమాదం జరిగింది. రెండు అంతస్తులో ఉన్న భవనంలో మంటలు చెలరేగాయి. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. యూసుఫ్ గూడా రహిమత్ నగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండు భవనాల్లో మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. టపాస్‌ రాకెట్లు ఇళ్లపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్‌ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ లో శ్రీ బాలాజీ టెంట్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగిందంటూ యజమాని కన్నీరు మున్నీరవుతున్నాడు.

ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలోని గోపాల్‌బాగ్ ప్రాంతంలోని బాణాసంచా మార్కెట్‌లో ఆదివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. 26 దుకాణాలు బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిలో, 9 మంది పరిస్థితి విషమంగా ఉంది, అధునాతన చికిత్స కోసం ఆగ్రాలోని ఆసుపత్రికి రిఫర్ చేయబడ్డారు.

Next Story