Hyderabad: ట్రావెల్స్ బస్సు బీభత్సం.. ఆగి ఉన్న కార్లపైకి దూసుకెళ్లడంతో..

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న కార్లపైకి ట్రావెల్ బస్సు దూసుకెళ్లింది.

By అంజి  Published on  5 July 2023 11:34 AM IST
Dhanunjaya travels, Erragadda, Hyderabad, rash driving

Hyderabad: ట్రావెల్స్ బస్సు బీభత్సం.. ఆగి ఉన్న కార్లపైకి దూసుకెళ్లడంతో..

హైదరాబాద్ నగరంలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. నిన్న హైదర్‌షా కోటే ప్రధాన రహదారి పక్కన మార్నింగ్‌ వాకింగ్‌ చేస్తున్న ముగ్గురిని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో తల్లీకూతురు దుర్మరణం చెందారు. ఈ ఘటన మరువకముందే.. నగరంలో మరో ప్రమాదం జరిగింది. ఎర్రగడ్డలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు బీభత్సం సృష్టించింది. ఇవాళ ఉదయం ఎర్రగడ్డలోని సిగ్నల్‌ దగ్గర ఆగి ఉన్న కార్లపైకి ధనుంజయ ట్రావెల్స్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎర్రగడ్డలో రెడ్‌ సిగ్నల్‌ ఉన్నప్పటికీ బస్సు డ్రైవర్‌ ఆగకుండా దూసుకొచ్చాడని, దీంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు సీజ్‌ చేశామని పోలీసులు చెప్పారు.

Next Story