Hyderabad: వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ.. నేపాలీ పనివాళ్లేనని అనుమానం
హైదరాబాద్ నగరంలో భారీ చోరీ జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ ఇంట్లో దాదాపు 5 కోట్ల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు నగదును ఎత్తుకెళ్లారు.
By అంజి Published on 12 July 2023 6:56 AM ISTHyderabad: వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ.. నేపాలీ పనివాళ్లేనని అనుమానం
హైదరాబాద్ నగరంలో భారీ చోరీ జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ ఇంట్లో దాదాపు 5 కోట్ల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు నగదును ఎత్తుకెళ్లారు. ఇంట్లో పనిచేసే నేపాలి వాళ్లే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈనెల 9వ తేదీన రాహుల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఫామ్‌హౌస్‌కి వెళ్ళాడు. తిరిగి నిన్న ఉదయం సింధు కాలనీలో ఉన్న తన ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వెళ్లే సరికి బెడ్ రూమ్‌లో ఉన్న తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దాంతోపాటుగా బీరువా తాళాలు కూడా పగలగొట్టి కనపడ్డాయి.
దీంతో అనుమానం వచ్చి చూడగా లోపల ఉన్న దాదాపు 50 లక్షల రూపాయల నగదుతో పాటు ఐదు కిలోల పైచిలుకు బంగారు ఆభరణాలు 50 కిలోల పైచిలుకు వెండి ఆభరణాలు కనిపించలేదు. దీంతో రాహుల్ రాంగోపాల్పేట పోలీసులను ఆశ్రయించాడు. తాను ఇంటికి తిరిగి వచ్చేసరికి భారీ చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇంట్లో ఉండాల్సిన నేపాలికి సంబంధించిన పని వాళ్ళు కూడా కనిపించట్లేదని ఫిర్యాదు చేశాడు. తన ఇంట్లో చోరీకి నేపాలి పని మనుషులకు సంబంధం ఉందని రాహుల్ అనుమానం వ్యక్తం చేశాడు. అయితే చోరీ రెండు రోజుల క్రితమే జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమాన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలతో పాటు రాహుల్ ఇంటి వీధిలో ఉన్న సీసీ కెమెరాలు అన్ని కూడా పోలీసులు పరిశీలించారు.
ఇంట్లో చోరీ రెండు రోజుల క్రితమే జరిగిందని పోలీసులకు ఆధారాలు లభించాయి. దీంతో నేపాలి సంబంధించిన పనివాళ్లను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలో దించారు. నిందితులు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. దొంగలను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. భారత సరిహద్దు ప్రాంతానికి కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పంపించారు. చోరీ చేసిన ఆభరణాలతో నిందితులు నేపాలివైపుగా వెళుతున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని రాంగోపాల్పేట ఇన్స్పెక్టర్ వెల్లడించారు.