సికింద్రాబాద్ ఆర్మీ ఏరియాలోని మారేడ్‌పల్లి ఏవోసీ సెంటర్‌లో ఘోర ప్రమాదం తప్పింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలను చూడగానే భయభ్రాంతులకు గురైన విద్యార్థులు కేకలు వేశారు. దీంతో అక్కడే ఉన్న పలువురు సైనికులు అప్రమత్తమై మంటలను ఆర్పివేసి విద్యార్థులను బస్సులో నుంచి రక్షించారు. మరో వైపు ఏవోసీ సెంటర్‌లో ట్రాఫిక్‌ను మొత్తం నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. కాగా ఈ ప్రమాదంలో పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడున్న వారంత ఊపిరిపీల్చుకున్నారు.