Hyderabad: టైరు పేలి.. లారీని ఢీకొట్టిన కారు
రంగారెడ్డి జిల్లాలోని మైలారదేవుపల్లి దుర్గా నగర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది.
By అంజి Published on 26 July 2023 10:54 AM ISTHyderabad: టైరు పేలి.. లారీని ఢీకొట్టిన కారు
రంగారెడ్డి జిల్లాలోని మైలారదేవుపల్లి దుర్గా నగర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ కారును ఈడ్చుకుంటూ వెళ్లిన ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. మనిషికి ఆయుషు ఆ దేవుడిచ్చిన వరం. ఎప్పుడు ఏ విధంగా మనల్ని మృత్యువు కబలిస్తుందో తెలియదు. ఇక కొన్ని సందర్భాల్లో అయితే మృత్యువు దగ్గరి దాకా వెళ్లి ప్రాణాలతో బయట పడుతూ ఉంటారు. మృత్యువును జయించి ఆ విధంగా ప్రాణాలతో బయటపడడం నిజంగా దేవుడు ఇచ్చిన వరం అని చెప్పవచ్చు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మైలార్‌దేవ్ పల్లి దుర్గా నగర్ నుండి చాంద్రాయణ గుట్టవైపు వెళుతున్న ఓ మారుతి కారు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పక్కన వెళుతున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆ లారీ అత్యంత వేగంగా కారును ఈడ్చుకుంటూ కొంత దూరం వరకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కారు టైర్ పేలి యాక్సిడెంట్.. తప్పిన భారీ ప్రమాదం.. (సీసీ ఫుటేజీ)హైదరాబాద్ - మైలార్ దేవ్పల్లి పరిధిలోని దుర్గానగర్లో ఆల్టో కారు టైర్ ఒక్కసారిగా పేలడంతో పక్కన వెళుతున్న లారీని ఢీకొట్టింది. కారును లారీ ఈడ్చుకుంటూ వెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. pic.twitter.com/vbkb5wcB1b
— Telugu Scribe (@TeluguScribe) July 26, 2023