అమెరికాలోని వాషింగ్టన్‌లో హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. మృతుడు నగరంలోని చైతన్యపురి గ్రీన్ హిల్స్ కాలనీలోని ఆర్కే పురం నివాసి కె రవితేజగా గుర్తించారు. రవితేజ తన మాస్టర్స్ డిగ్రీని అభ్యసించేందుకు మార్చి, 2022లో అమెరికా వెళ్లారు. బుల్లెట్ గాయాలు తీవ్రంగా కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో చైతన్యపురిలోని రవితేజ ఇంటికి అతని స్నేహితులు, బంధువులు చేరుకోవడంతో అతని తల్లిదండ్రులకు సంఘీభావం తెలపడంతో అతని ఇంట్లో విషాదం అలుముకుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల తెలియాల్సి ఉంది.