ఫ్యాన్సీ నంబర్.. స్టేటస్ సింబల్.. 9999 నంబరు కోసం ఎంత చెల్లించారంటే..?

9999 Fetches Rs 20.10 lakh in Hyderabad. ఫ్యాన్సీ నంబర్లు, అదృష్ట సంఖ్యలు, రైజింగ్ నెంబర్లుగా భావించే కొన్ని రకాల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Dec 2021 7:04 AM GMT
ఫ్యాన్సీ నంబర్.. స్టేటస్ సింబల్.. 9999 నంబరు కోసం ఎంత చెల్లించారంటే..?

ఫ్యాన్సీ నంబర్లు, అదృష్ట సంఖ్యలు, రైజింగ్ నెంబర్లుగా భావించే కొన్ని రకాల వాహన రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం అనూహ్యమైన పోటీ నెలకొంటోంది. ఫ్యాన్సీ నంబర్ల‌ క్రేజ్ ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ మధ్య ఇది మరీ ఎక్కువైంది. బీఎండబ్ల్యూ, ల్యాండ్ రోవర్, ల్యాండ్ క్రూజర్, ఆడి వంటి ఖరీదైన వాహనాలే కాదు, బెక్‌ల కోసం కూడా వాహనదారులు పోటీకి దిగుతున్నారు. తమకు నచ్చిన నంబర్ల కోసం వాహనదారులు లక్షలు వెచ్చించేందుకు వెనుకాడ‌డం లేదు. ఇదే ఆర్టీఏకు కనకవర్షం కురిపిస్తోంది. ఇక ఎక్కువ మంది కోరుకునే '9' కుజ గ్రహానికి ప్రతీకగా భావిస్తారు. జీవితంలో తిరుగులేని నాయకులుగా ఎదగాలంటే ఈ నెంబ‌ర్ ఉండాలని భావిస్తారు.

ఇక మంగళవారం నిర్వహించిన ఆన్‌లైన్‌ టెండర్‌ ప్రక్రియలో టీఎస్‌09 ఎఫ్‌టీ 9999 నంబరును కీస్టోన్‌ ఇన్‌ఫ్రా సంస్థ అనే సంస్థ రూ.20.10లక్షలు చెల్లించి ద‌క్కించుకుంది. కొత్త సిరీస్‌లో టీఎస్‌09 ఎఫ్‌యూ 0009 నంబరు కోసం ఎపిటోమ్‌ ప్రాజెక్ట్స్‌ రూ.7.95 లక్షలు చెల్లించగా.. 0001 నంబరు కోసం రూ.3.08లక్షలు చెల్లించి రాధికరెడ్డి పెరటి ద‌క్కించుకున్నారు. మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన ఆన్‌లైన్ టెండ‌ర్ ద్వారా హైదరాబాద్‌ జిల్లా రవాణా శాఖకు రూ.46,14,824 ఆదాయం చేకూరిందని జేటీసీ పాండురంగ నాయక్ తెలిపారు.

Next Story