శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.18 కోట్ల విలువైన 30 రోలెక్స్ వాచ్‌లు స్వాధీనం!

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ విలువైన లగ్జరీ వాచ్‌ల స్మగ్లింగ్ గుట్టు రట్టు చేశారు.

By -  Knakam Karthik
Published on : 9 April 2026 11:23 AM IST

Hyderabad News, RGIA, ShamshabadAirport, RolexSmuggling, Customs Seizure, SmugglingBusted

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.18 కోట్ల విలువైన 30 రోలెక్స్ వాచ్‌లు స్వాధీనం!

హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ విలువైన లగ్జరీ వాచ్‌ల స్మగ్లింగ్ గుట్టు రట్టు చేశారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా సుమారు రూ.18 కోట్ల విలువైన 30 రోలెక్స్ (Rolex) వాచ్‌లను స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఈ వాచ్‌లను హైదరాబాద్ నుండి ముంబైకి తరలిస్తుండగా స్కానింగ్ సమయంలో అధికారులు గుర్తించారు.

అనుమానాస్పదంగా ఉన్న ప్యాకేజీలను తనిఖీ చేయగా, ఎలాంటి పత్రాలు లేని ఈ ఖరీదైన గడియారాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రయాణికులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వాచ్‌లను ఎక్కడి నుండి దిగుమతి చేసుకున్నారు, పన్నులు చెల్లించారా లేదా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇంత పెద్ద మొత్తంలో లగ్జరీ వాచ్‌లు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.

Next Story