హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సరస్సులో ఓ వివాహిత తన రెండేళ్ల కూతురితో కలిసి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఈ నెల 2వ తేదీన జరిగింది. ఆ మహిళ మృతదేహం సోమవారం లభించగా.. పాప డెడ్‌బాడీని మంగళవారం నాడు గుర్తించారు. లేక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళను చార్టర్డ్ అకౌంటెంట్ కీర్తికా అగర్వాల్ గా, ఆమె కుమార్తె బియారాగా గుర్తించారు. నివేదికల ప్రకారం, ఆమె కుటుంబ సమస్యలను ఎదుర్కొంటుందని, గత ఒక సంవత్సరం నుండి తన కుమార్తెతో కలిసి బహదూర్‌పురాలోని తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తున్నట్లు సమాచారం.
నవంబర్ 2న మహిళ తన కుమార్తెతో కలిసి హుస్సేన్ సాగర్ సరస్సులోకి దూకింది. మరుసటి రోజు నెక్లెస్ రోడ్‌లోని నీరా కేఫ్ సమీపంలో ఆమె మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నప్పటికీ, ఆమె గుర్తింపు నిర్ధారించబడలేదు. మరోవైపు, కీర్తిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో వారు మృతదేహాన్ని కీర్తికాది గుర్తించారు. దాని తర్వాత, మంగళవారం చిన్నారి మృతదేహం లభ్యమైంది. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.