హైదరాబాద్‌లో రోడ్డుపై బర్త్‌ డే సెలబ్రేషన్‌.. యువకుడికి జైలు శిక్ష

27-year-old man lands in jail for celebrating birthday on main road. సాధారణంగా ఎవరైనా తమ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకుంటున్నారు.

By అంజి  Published on  16 Dec 2022 5:01 AM GMT
హైదరాబాద్‌లో రోడ్డుపై బర్త్‌ డే సెలబ్రేషన్‌.. యువకుడికి జైలు శిక్ష

సాధారణంగా ఎవరైనా తమ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకుంటున్నారు. అయితే ఆ సెలబ్రేషన్‌ను ఇంట్లోనో లేదంటే రెస్టారెంట్లలోనే చేసుకుంటారు. అయితే ఓ యువకుడు మాత్రం అందుకు భిన్నంగా రోడ్డుపై తన పుట్టిన రోజును జరుపుకోవాలనుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలో జరిగింది. నవంబర్ 13న సంతోష్‌నగర్‌లోని దర్గా బర్హానా షా ప్రాంతంలో నివాసం ఉంటున్న మాజీద్ అలీఖాన్ అనే వ్యక్తి.. తన పుట్టిన రోజు సందర్భంగా ప్రధాన రహదారిపై వేదికను ఏర్పాటు చేసి స్నేహితులు, కుటుంబ సభ్యులను ఆహ్వానించాడు. ఈ కార్యక్రమంలో డీజే కూడా ఏర్పాటు చేశారు.

అదే సమయంలో దర్గా బర్హనా షా వద్ద వార్షిక ఉర్స్ జరుగుతుండగా, పుట్టినరోజు వేడుకలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మజీద్ అలీ, డీజే కమ్‌సర్పు ప్రభాకర్‌పై రోడ్డుకు అడ్డంగా వేదిక పెట్టుకుని విధులు నిర్వర్తించకుండా పోలీసులను అడ్డుకున్నందుకు కేసు నమోదు చేశారు. గురువారం వారిని కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితులిద్దరికీ ఐదు రోజుల జైలుశిక్ష విధించారు. అనంతరం వారిని చంచల్‌గూడలోని సెంట్రల్‌ జైలుకు తరలించారు.

Next Story