ఫ్యూచర్ సిటీలో 24 గంటల పాటు మద్యం షాపులు బంద్!

హనుమాన్ జయంతి వేడుకల నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24 గంటల పాటు మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తూ కమిషనర్ జి. సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు

By -  Knakam Karthik
Published on : 1 April 2026 7:05 PM IST

Hyderabad News, HanumanJayanti, FutureCity, Liquor Ban, PoliceOrders, SudheerBabu

ఫ్యూచర్ సిటీలో 24 గంటల పాటు మద్యం షాపులు బంద్!

హనుమాన్ జయంతి వేడుకల నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24 గంటల పాటు మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తూ కమిషనర్ జి. సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 6 గంటల వరకు అన్ని రకాల వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు మరియు రెస్టారెంట్లు మూసి ఉంచాలని స్పష్టం చేశారు.

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎక్సైజ్ చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, స్టార్ హోటళ్లు మరియు రిజిస్టర్డ్ క్లబ్‌లకు మాత్రం ఈ నిబంధన నుండి మినహాయింపు ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Next Story