హైదరాబాద్ నగరంలో విషాద ఘటన జరిగింది. అబూ జాకీర్‌గా గుర్తించబడిన 15 నెలల బాలుడు తన ఇంట్లో ప్రమాదవశాత్తు దోమల వికర్షక ద్రవాన్ని తాగి మరణించాడు. ఈ ఘటన చందానగర్‌లోని తారానగర్‌లో శనివారం చోటుచేసుకుంది చిన్నారి అబ్బు జాకీర్ ఇంట్లో ఒంటరిగా ఆడుకుంటున్నాడని, ఆ సమయంలో విషపూరిత ద్రవాన్ని తాగాడని పోలీసులు తెలిపారు. అతని తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులు. కాసేపటి తర్వాత బెడ్‌రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన జాకీర్‌ను తల్లిదండ్రులు గుర్తించారు. బాలుడి బట్టలపై ఆల్ అవుట్ లిక్విడ్ వాసన రావడంతో అనుమానం వచ్చింది.
వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో విశాదఛాయలు అలుముకున్నాయి. చిన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఎదిగే సమయంలో వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఒక వయస్సు వచ్చేవరకు కనిపెట్టుకుంటే ఉండాలి. పిల్లలు చిన్నతనంలో ఏది కనపడినా వెంటనే నోట్లు పెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పసిపిల్లల పట్ల నిర్లక్ష్యం చేస్తే పూడ్చలేని నష్టానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి.