హైదరాబాద్‌లో రూ.13 వేల కోట్ల భారీ స్కామ్..అసలు ట్విస్ట్ ఏంటంటే?
హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) అధికారులు ఒక భారీ ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్ గుట్టురట్టు చేశారు.
By - Knakam Karthik |
హైదరాబాద్‌లో రూ.13 వేల కోట్ల భారీ స్కామ్..అసలు ట్విస్ట్ ఏంటంటే?
హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) అధికారులు ఒక భారీ ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్ గుట్టురట్టు చేశారు. ఏకంగా రూ.13,000 కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడిన ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి పంకజ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అరెస్టయిన పంకజ్ కుమార్, 'అడ్సమ్ అడ్వైజరీ సర్వీస్' అనే ఫిన్‌టెక్ సంస్థకు వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ పని ఏంటంటే.. బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేల తరపున కస్టమర్ల వివరాలను సరిచూడటం (Digital KYC). అంటే, మోసాలు జరగకుండా ఆపాల్సిన వ్యక్తే, స్వయంగా మోసగాళ్లకు మార్గం సుగమం చేశాడు.
ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్లు నిర్వహించడానికి వందలాది నకిలీ (Shell) కంపెనీలను సృష్టించారు. పంకజ్ కుమార్ తన అధికారంతో ఈ నకిలీ కంపెనీలకు అక్రమంగా KYC ధృవీకరణ పూర్తి చేశాడు. దీనివల్ల ఆ కంపెనీలకు సులభంగా పేమెంట్ గేట్‌వేలు, UPI సదుపాయాలు లభించాయి. ఫిన్‌టెక్ కంపెనీలు, పేమెంట్ అగ్రిగేటర్ల సాయంతో గేమింగ్ ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయలను గుట్టుచప్పుడు కాకుండా మళ్లించారు. ఈ అక్రమ మార్గంలో వచ్చిన సొమ్ములో పంకజ్ కుమార్ కూడా భారీగా వాటాలు అందుకున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ సిండికేట్‌కు చెందిన వివిధ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ. 100 కోట్లను అధికారులు స్తంభింపజేశారు. 2025 నాటికి భారత్‌లో ఆన్‌లైన్ గేమింగ్ విలువ సుమారు $23 బిలియన్లు (₹2 లక్షల కోట్లు) ఉండటంతో, ఇలాంటి సిండికేట్లు భారీగా లాభపడుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో మరిన్ని లింకుల కోసం అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? విదేశీ సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో DGGI లోతుగా విచారిస్తోంది.