Hyderabad: లిఫ్ట్‌లో ఇరుక్కున్న గర్భిణి సహా 12 మంది
హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట్‌లో ఉన్న పీవీఆర్ మాల్‌లో సినిమా చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు షాకింగ్ అనుభవం ఎదురైంది.
By అంజి Published on 5 July 2023 1:06 PM ISTHyderabad: లిఫ్ట్‌లో ఇరుక్కున్న గర్భిణి సహా 12 మంది
ఇటీవల కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువై పోయాయి. హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట్‌లో ఉన్న పీవీఆర్ మాల్‌లో సినిమా చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. మాల్‌లోని లిఫ్ట్‌లో వెళ్తుండగా ఒక్కసారిగా అది ఆగిపోయింది. దీంతో లిఫ్ట్‌లో ప్రవళిక అనే గర్భిణి సహా 12 మంది చిక్కుకుపోయారు. ఈ ఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న మలక్‌పేట్ ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లిఫ్ట్‌లో జరిగిన సాంకేతిక లోపాన్ని సరిచేసి, లిఫ్ట్ తలుపులను తెరిపించి అందులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తరలించారు.
మలక్ పేట పివిఆర్ మాల్‌లో ఆగిపోయిన లిఫ్ట్ నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనలో లిఫ్టులో 12 మంది ఉండగా అందులో ప్రవల్లిక అనే గర్భిణీ ఉంది.చివరికి ఫైర్ సిబ్బంది, పోలిసులు అక్కడకు చేరుకుని లిఫ్టును తెరవడంతో తప్పిన ప్రమాదం.#PVRmall #Hyderabad pic.twitter.com/J18WaeDHtf
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2023
దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. నిత్యం రద్దీగా ఉండే మాల్‌లో ఇలాంటి సంఘటన జరగడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాల్ నిర్వాహకుల నిర్లక్ష్యం, మెయింటనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లే లిఫ్ట్ ఆగినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా మాల్ యాజమాన్యం భద్రతా చర్యలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. దీని వల్ల మరోసారి ప్రమాదం జరగకుండా అరికట్టవచ్చు. రోజూ దేశంలో ఏదో ఒక చోట లిఫ్ట్ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు.