యాక్టివాపై 117 చ‌లానాలు.. షాకైన పోలీసులు

117 Pending Challans On Activa.ఎవ‌రు అయినా స‌రే ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాల్సిందే. లేదంటే ప్ర‌మాదాల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Nov 2021 10:49 AM GMT
యాక్టివాపై 117 చ‌లానాలు.. షాకైన పోలీసులు

ఎవ‌రు అయినా స‌రే ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాల్సిందే. లేదంటే ప్ర‌మాదాల‌కు గురి కావ‌డంతో పాటు ఒక్కొసారి మ‌న వ‌ల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంబించిపోతుంటుంది. అందుక‌నే ట్రాఫిక్ రూల్స్‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తుంటారు. ఇక ఈ రూల్స్ పాటించ‌ని వారికి ట్రాఫిక్ పోలీసులు చ‌లానాలు వేస్తుంటారు. అయితే.. కొంద‌రు మాత్రం ఈ చ‌లానాలను లెక్క‌చేయ‌డం లేదు స‌రిక‌దా.. వాటిని క‌ట్ట‌డం లేదు. ఈ నేప‌థ్యంలో చ‌లానాలు క‌ట్ట‌కుండా తిరుగుతున్న వాహ‌నాల‌పై ట్రాఫిక్ పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అనుమానం ఉన్న వాహ‌నాల‌ను ఆపి చ‌లానాలు చెక్ చేస్తున్నారు.

ఇక్క‌డ ఓ వ్యక్తి రూల్స్‌ను పాటించకుండా తిరుగుతున్నాడు. ట్రాఫిక్ పోలీసులు చ‌లానాలు విధిస్తున్నా కూడా వాటిని అవార్డులు అని అనుకున్నాడో ఏమోగానీ తెలీదు కానీ ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 117 చ‌లాన్లు పెండింగ్‌లో ఉంచాడు. నాంపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆ వ్య‌క్తి పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. మహ్మద్‌ ఫరీద్‌ ఖాన్‌ పేరుతో ఉన్న ఏపీ09 ఏయూ 1727 నెంబర్‌ గల హోండా యాక్టివాపై ఉన్న చలాన్లు చూసి పోలీసులే షాక్ అయ్యారు. హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ఎదురుగా అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులు వాహ‌నాల‌ను త‌నిఖీ చేశారు. ఈక్ర‌మంలో ప‌రీద్.. వాహ‌నాన్ని ఆపి చెక్ చేయ‌గా 117 చ‌లాన్లు ఉన్న‌ట్లు గుర్తించారు. రూ.30వేల పెండింగ్ అమౌంట్ ఉండ‌డంతో వాహ‌నాన్ని సీజ్ చేశారు పోలీసులు.

Next Story