హైదరాబాద్‌లో వారం రోజుల్లో 700 మి.మీ వర్షపాతం

By సుభాష్  Published on  21 Oct 2020 11:14 AM GMT
హైదరాబాద్‌లో వారం రోజుల్లో 700 మి.మీ వర్షపాతం

హైదరాబాద్‌ నగరంలో వారం రోజుల్లో 700 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌

కుమార్‌ వెల్లడించారు. నగరంలో సగటున 800 మి.మీ వర్షపాతం నమోదవుతుందని, ఈ ఏడాది కేవలం వారం రోజుల్లోనే 700

మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. జంట నగరాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా

నగరమంతా అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదలపై జలసౌధలో నీటిపారుదల శాఖ కమిషనర్‌, అధికారులతో

రజత్‌ కుమార్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చెరువులకు గండ్లు పడకుండా అప్రమత్తం చేసే అంశంపై ప్రధానం

చర్చించారు.

నగరంలో కురిసిన భారీ వర్షాలకు 185 చెరువులు పూర్తిగా నిండిపోయాయని, ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు 15

తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ బృందాలు చెరువులను పరిశీలించి అనంతరం మరమ్మతులకు నిధులు

మంజూరు చేస్తామని చెప్పారు. అలాగే చెరువుల పునరుద్దరణకు మంత్రి కేటీఆర్‌ రూ.2 కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు.

నగరంలో 53 చెరువులు దెబ్బతినగా, వాటికి త్వరలోనే మరమ్మతులు చేపడతామన్నారు.

Next Story