పాతబస్తీలో తల్లీకూతురు దారుణ హత్య

By సుభాష్  Published on  14 Feb 2020 6:58 AM GMT
పాతబస్తీలో తల్లీకూతురు దారుణ హత్య

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. పాతబస్తీలో తల్లీకూతురును దారుణంగా చేశారు. ఘాజీమిల్లత్‌ నల్లవాగులోని ఓ ఇంట్లో శుక్రవారం ఉదయం సాజితాబేగం (60), ఆమె కుమార్తె ఫరీదాబేగం (32)లు హత్యకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. వారి సమీప బంధువు రెహమాన్‌ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆర్థికల లావాదేవీల కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, ఫరీదాబేగం భర్త దుబాయ్‌లో ఉంటున్నాడు.

Next Story
Share it