హైదరాబాద్ : నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచవటి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. పంచవటి కాలనీ లోని రోడ్ నెంబర్ 10 నందు గల టీవీఎస్ లేక్ వ్యూ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ కింద పడి ధనుష్ (9) అనే బాలుడు మృతి చెందాడు. బాలుడి మరణంతో అపార్ట్‌మెంట్ పరిసర ప్రాంతాల్లో విషాదచాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకొన్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.