హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీదు బండలో నాగేశ్వరి అనే 10 ఏళ్ళ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో బయటకు వెళ్తున్నానని చెప్పింది. నాగేశ్వరి ఎంతకు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గాలించారు. దీంతో సమీపంలోని భవనంపై నుంచి దూకి నాగేశ్వరి మృతి చెందినట్టుగా స్థానికులు భావిస్తున్నారు. మహబూబ్ బాగర్ జిల్లా వనపర్తి కి చెందిన మొగులయ్య, పద్మ దంపతుల కుమార్తె నాగేశ్వరీ. మజీద్‌ బండలో నాగేశ్వరి తల్లిదండ్రులు టీస్టాల్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.