హైదరాబాద్‌: హయత్ నగర్ లో ఉన్న అగ్నిమాపక శాఖ కార్యాలయం రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా జలదిగ్బంధం లో కూరుకుపోయింది ఆఫీసులో కుర్చీలు మునిగిపోయేలా నీటితో నిండిపోయింది . కార్యాలయంలో ఉన్న ఫైల్స్ సైతం నీటిలో మునిగిపోయాయి. ఈ ఫైర్ స్టేషన్ లోతట్టు ప్రాంతములో ఉండటంతో వర్షం కురిసిన ప్రతిసారి మునిగిపోతుందని స్థానికులు చెప్పారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఫైర్ సిబ్బంది కోరుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.