హైదరాబాద్ నగరం సేఫ్
By సుభాష్ Published on 8 May 2020 6:43 AM GMT
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి అనుకుని ప్రమాదకరమైన ఎలాంటి గ్యాస్ వాయువు వెలువడే కంపెనీలు లేకపోవడంతో హైదరాబాద్ సిటీ సేఫ్ జోన్‌లో ఉంది. నిన్న విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో వెలువడిన రసాయన వాయువు వల్ల 12 మంది మృత్యువాత పడ్డారు. వెయ్యికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో నగరంలో ఎలాంటి పరిశ్రమలు లేవని, పీసీబీ, పరిశ్రమల శాఖలు స్పష్టం చేశాయి.
హైదరాబాద్‌లో ఎల్పీజీ గ్యాస్ కేంద్రాలు మినహా ఎలాంటి విష వాయువు చిమ్మే కంపెనీలు, సంస్థలు లేవని పేర్కొన్నాయి. నగరంలో బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు సహా ఇతర పరిశ్రమలు సైతం పీబీసీ, పరిశ్రమల శాఖ పలు మార్గదర్శకాలు పాటించేలా చర్యలు చేపడుతున్నాయి. వారికి పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కరోనా భయం తప్ప ఎలాంటిది లేదు. విశాఖ ఘటనతో ప్రజల్లో మరింత భయం పట్టుకుంది. పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా భయం ఉంటే.. ఇప్పుడు విశాఖలో జరిగిన ఉదాంతంతో మరింత భయం పట్టుకుంది.
దేశ వ్యాప్తంగా పరిశ్రమలు ఉన్న పరిసరాల ప్రాంతాల ప్రజల్లో టెన్షన్ మొదలైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్దగా విష వాయువు వెలువడే పరిశ్రమలు లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో మాత్రం రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక తెలంగాణలో మాత్రం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఒక్క హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో గురువారం 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.