హైదరాబాద్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఫుల్లుగా మద్యం సేవించి ఫియట్ కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఎర్రగడ్డ ఫ్రూట్ మార్కెట్ సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టాడు. కారులో ఉన్న బెలూన్స్ ఓపెన్ కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఆర్ నగర్ పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులో తీసుకున్నారు. ఎసెన్షియల్ సర్వీసెస్ పాస్‌తో కూడిన స్టిక్కర్‌ను అతికించుకుని ఉన్న ఫియట్ కారును పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.