రాష్ డ్రైవింగ్ తో రెండు నిండు ప్రాణాలు బలి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Sep 2019 1:51 PM GMT
రాష్ డ్రైవింగ్ తో రెండు నిండు ప్రాణాలు బలి

  • హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం
  • ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు

హైదరాబాద్‌: అల్వాల్‌ రోడ్డు ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. బెల్ ఎన్‌క్లేవ్‌కు చెందిన ప్రియదర్శిని, ఆమె మేనల్లుడు అయాన్, అన్నలతో కలిసి ఆస్పత్రికి వెళ్లి ..ఇంటికి వస్తుండగా వెనుక నుండి వచ్చిన కారు వీరి బైకు ను ఢీ కొట్టింది. దీంతో.. ప్రియదర్శిని, అయాన్ ఇద్దరూ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. జూమ్ కారుని అద్దెకు తీసుకుని ఇద్దరు యువకులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇద్దరు యువకులను అల్వాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రియదర్శిని అన్న ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డాడు. ప్రియదర్శిని, అయాన్ మృతదేహాలు గాంధీ మార్చురీ లో ఉంచారు. కాగా, ప్రియదర్శిని, ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తున్నట్టు సమాచారం.

Next Story