హైదరాబాద్‌ వ్యాపారుల సంచలన నిర్ణయం

By సుభాష్  Published on  18 Jun 2020 1:54 PM GMT
హైదరాబాద్‌ వ్యాపారుల సంచలన నిర్ణయం

తెలంగాణలోకరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ హైదరాబాద్‌ వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ పరిధిలోనే ప్రతి రోజు అత్యధిక కేసులు నమోదువుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు స్వచ్చంధంగా లాక్‌డౌన్‌ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ మాత్రమే షాపులు తెరవాలని బేగంబజార్‌, ఫిల్‌ఖానా, సిద్ది అంబర్‌పేటలోని వ్యాపారుల అసోసియేషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 4 తర్వాత ఎవ్వరూ కూడా షాపులు తెరవకూడదని తీర్మానం చేస్తూ.. హైదరాబాద్‌ హోల్‌సేల్‌ వ్యాపారులు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇది చదవండి: తెలంగాణలో డ్వాక్రా మహిళలకు కరోనా రుణాలు.. ఎంత అంటే

అంతేకాదు భారత్‌ - చైనా దేశాల హింసాత్మక ఘటనలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇక నుంచి చైనా ఉత్పత్తులను ఏమాత్రం విక్రయించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇది చదవండి: రేపటి నుంచి ఆ నాలుగు జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్

కాగా, తెలంగాణలో ఇప్పటి వరకూ 5675 కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా గడిచిన 24 గంటల్లో 269 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఒకరు మృతి చెందగా, ఇప్పటి వరకూ 192 మంది మృతి చెందారు. తాజాగా ఒక్క జీహెచ్‌ఎంసీలోనే 214 కేసులు నమోదు కాగా, అత్య‌ధికంగా రంగారెడ్డిలో 13, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 10 కేసులు, కరీంనగర్ లో 8 కేసులు, జనగాంలో 5 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇది చదవండి: రూ.50వేల కోట్లలో భారీ ప్యాకేజీ.. 20న ప్రారంభించనున్న మోదీ

Next Story