హైదరాబాద్: గ్రేటర్‌లో 45 బస్తీ దవాఖానాలు
By సుభాష్ Published on 22 May 2020 11:29 AM ISTప్రతి ఒక్కరికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో వైద్యశాలలు పెరగనున్నాయి. దీంతో గ్రేటర్‌లో ప్రభుత్వం వైద్యం మరింత అందుబాటులోకి రానుంది. పేదలకు సరైన వైద్యం అందించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌లో 123 దవాఖానలను ఏర్పాటు చేయగా, కొత్తగా మరో 45 బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
ఇప్పటికే భవన నిర్మాణ పనులను పూర్తి చేసిన వైద్యాధికారులు వైద్య పరికరాలను ఏర్పాటు చేసేందుకు బిజీబిజీగా ఉన్నారు. కాగా, సిబ్బంది నియామక ప్రక్రియను సైతం పూర్తి చేసి ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డిలు బస్తీదవాఖాలను ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేశారు.
గ్రేటర్ పరిధిలో 123 దవాఖానాలు
కాగా, గ్రేటర్ పరిధిలో మొత్తం 123 దవాఖానాలుండగా, ఇందులో హైదరాబాద్ జిల్లాలో 74, రంగారెడ్డి పరిధిలో 23, మేడ్చల్ పరిధిలో 26 ఉన్నాయి. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 46 గంటల వరకూ ఆరోగ్య సేవలు అందుతున్నాయి.
కొత్తగా బస్తీ దవాఖానాలు ఇవే..
సికింద్రాబాద్
డొక్కాలమ్మ టెంపుల్, శివాజీనగర్, చేపలబాయ్, మోండామార్కెట్, విజయపురి కాలనీ, తార్నాక, డీఎస్ నగర్, కవాడిగూడ, ఉమదానగర్, కమ్యూనిటీ
ఖైరతాబాద్..
కమాటిపుర కమ్యూనిటీ హాల్, జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాల్, హనుమన్‌టేక్డీ, ఎన్‌బి నగర్, బంజారాహిల్స్, ఇంద్రనగర్ జీవైఎం సెంటర్, వెంకటేశ్వరనగర్, అంబికా మహిళా మండలి, జూబ్లీహిల్స్, కమ్యనిటీహాల్, పీజేఆర్ నగరర్, బీసీ వడ్డెర బస్తీ కమ్యూనిటీ హాల్, ఎంజీ నగర్, దత్తాత్రేయణ, ఆసిఫర్‌నగర్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, భోజగుట్ట
చార్మినార్ జోన్
మిలత్‌నగర్, సైదబాద్, చంద్రాయణగుట్ట, నిమ్రాకాలనీ, జాఖీర్ హుస్సేన్ కాలనీ, క్యాలెండర్ నగర్, కమ్యూనిటీ హాల్, రాజేంద్రనగర్, కొండాపూర్
కూకట్‌పల్లి
ద్వారకానగర్, కుత్బుల్లాపూర్, అంబేద్కర్ నగర్, కొత్తబస్తీ, మహిళామండలి భవన్, కుషాయిగూడ, రంగారెడ్డి నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, అల్వాల్, అరుంధతి, వెంకటేశ్వర కమ్యూనిటీ హాల్, చింతల్, నందనగర్, రంగారెడ్డి, తుర్కపల్లి, మోడల్ మార్కెట్, భగత్‌సింగ్‌నగర్, అశోక్‌నగర్, కామేశ్వరరావు కాలనీ, సరూర్‌నగర్, అధికారి నగర్, బీఎస్‌రెడ్డి కాలనీ, సాయిరాంనగర్, కుషాయిగూడ, అశోక్‌నగర్, సింగం చెరవు, వివేకానందనగర్, కాప్రా, కమలానగర్ కమ్యూనిటీ హాల్,
శేరిలింగంపల్లి
పటాన్‌చెరు, చైతన్యనగర్ కాలనీ, కనుకుంట, ప్రభుత్వ పాఠశాల, ఆర్సీ పురం, ప్రేమ్‌నగర్ కమ్యూనిటీ హౄల్, కొండాపూర్, కార్మికనగర్, రామంతానగర్, యాదగిరినగర్ కమ్యూనిటీ హాల్, సుల్తాన్‌నగర్ కమ్యూనిటీ హాల్ ఎర్రగడ్డ.
500 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడమే లక్ష్యం
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలో 500 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ కృషి చేస్తోందని నగర్ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. గురువారం కవాడి గూడ డివిజన్ పరిధిలో దోమలగూడలో ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న బస్తీ దవాఖానును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైన చోట్ల బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు.