హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో కంటైన్‌మెంట్ జోన్లు ఇవే..!
By సుభాష్ Published on 3 May 2020 9:44 PM ISTదేశంలో కరోనా కోరలు చాస్తోంది. కరోనాను అరికట్టేందుకు లాక్‌డౌన్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అయితే ఏపీలో కేసుల సంఖ్య అధికంగా పెరరుగుతున్నా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గత మూడు, నాలుగు రోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోగా, శనివారం మాత్రం 17 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ కోవిడ్ కేసుల సంఖ్య 1082 కు చేరింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెడ్ జోన్, గ్రీన్‌జోన్, కంటైన్మెంట్ జోన్లను గుర్తించారు అధికారులు. ఈ మేరకు హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్ల ప్రాంతాల జాబితాను తయారు చేసింది.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో 9 కేంద్రాలు, హైదరాబాద్ పరిధిలో 30 కంటైన్‌మెంట్ కేంద్రాలు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 కంటైన్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.