హుజూర్‌ నగర్‌లోకారు ఖాయమేనా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2019 2:34 PM GMT
హుజూర్‌ నగర్‌లోకారు ఖాయమేనా?

హుజూర్‌ నగర్‌: హుజూర్ నగర్‌లో గులాబీ జెండా ఎగరనుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. హుజూర్ నగర్‌ నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. యావరేజ్‌నా 53.73 శాతం ఓట్లను టీఆర్‌ఎస్ కొల్లగొట్టింది. ఇక..కాంగ్రెస్ 41.04 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. టీడీపీ కేవలం 2.21 శాతం, బీజేపీ 1.17 శాతం, ఇండిపెండెంట్స్ 1.84 శాతం ఓట్లు రాబట్టుకున్నట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇక..మండలాలు వారిగా చూస్తే...

హుజూర్ నగర్‌ : ఈ మండలంలో టీఆర్‌ఎస్‌ 54.50 ఓట్లతో ప్రత్యర్దులకు అందనంత దూరంలో ఉంది. కాంగ్రెస్ 39.8, టీడీపీ 2.2, బీజేపీ 1.2, స్వతంత్రులు 2.3 శాతం ఓట్లు ఈ మండలంలో సాధించనున్నారు.

నేరేడు చర్ల : ఈ మండలంలో టీఆర్‌ఎస్ 51.20 శాతం ఓట్లు సాధించింది.

కాంగ్రెస్ 44.6, టీడీపీ 1.1, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 2.1 శాతం ఓట్లు కొల్లగొట్టనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.

గారేడు పల్లి: ఈ మండలంలో టీఆర్‌ఎస్ 53.90 శాతం ఓట్లు రాబట్టుకుంది. కాంగ్రెస్ 40.4, టీడీపీ 2.7, బీజేపీ 0.9, ఇండిపెండెంట్లు 2.1 శాతం ఓట్లు ఈ మండలంలో సాధించారు

మట్టపల్లి: ఈ మండలంలో 54. 50 శాతం ఓట్లను గులాబీ దళం కొల్లగొట్టింది. కాంగ్రెస్ 39.3, టీడీపీ 1.9, బీజేపీ 1.5, ఇండిపెండెంట్లు 2.8 శాతం ఓట్లు రాబట్టుకున్నాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.

మేళ్ల చెరువు : ఈ మండలంలో 51 శాతం ఓట్లను కారు రాబట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ 42.6, టీడీపీ 2.8, బీజేపీ 1.6, స్వతంత్రులు 2 శాతం ఓట్లు సంపాదించుకున్నారు.

చింతలపాలెం: ఈ మండలంలో గులాబీ దళం 56 శాతం ఓట్లు కొల్లగొట్టనుంది. ఇక్కడ ఎవరికి అందనంత ఎత్తులో గులాబీ దళం ఉంది. కాంగ్రెస్ 41,టీడీపీ 1.9, బీజేపీ 0.6, స్వతంత్రులు 0.5శాతం ఉన్నారు.

పాలక్‌వేడు: ఈ మండలంలో టీఆర్‌ఎస్ 55శాతం ఓట్లు దక్కించుకోనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ మండలంలో కాంగ్రెస్ 41.04, టీడీపీ 2.21, బీజేపీ 1.17, స్వతంత్రులు 1.84 శాతం ఓట్లు గెల్చుకోనున్నారు.

Huzur Nagar Exit Poll

హుజూర్ నగర్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లోనూ టీఆర్‌ఎస్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. అన్ని మండలాల్లోనూ 50 శాతం పైగానే ఓట్లు కొల్లగొట్టింది. సిట్టింగ్ సీట్ నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ...కష్టమేనని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

టీఆర్‌ఎస్‌కే జై కొట్టిన 'ఆరా'

Huzurnagar Aara

'ఆరా' ఎగ్జిట్ పోల్ ప్రకారం టీఆర్‌ఎస్‌ 50.48 శాతం ఓట్లు గెలుచుకుంటుంది. కాంగ్రెస్ 39.95 శాతం ఓట్లు పడతాయి. ఇక..ఇతరులు కేవలం 9.57 శాతం ఓట్లకు పరిమితం అవుతారు.ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హుజూర్ నగర్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story