నా భార్య చిత్ర హింసలు పెడుతోంది.. నన్ను కాపాడండి మహాప్రభో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jun 2020 6:53 AM GMT
నా భార్య చిత్ర హింసలు పెడుతోంది.. నన్ను కాపాడండి మహాప్రభో

సార్‌.. నా భార్య చిత్రహింసలు పెడుతోంది. చెప్పుతో కొడుతూ.. సిగరెట్‌తో కాల్చుతోంది. దయచేసి కాపాడండి.. ఆమెపై గృహహింస కింద కేసు పెట్టండి అని ఓ భర్త పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి మొరపెట్టుకున్నాడు. భార్యలు గృహహింస కింద కేసులు పెట్టడం చూశాం కానీ.. దీనికి వ్యతిరేకంగా భార్యపై గృహహింస కేసు పెట్టాడు ఓ భర్త. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..జ్యోతిర్మయిమజుందార్ ఓ సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ కోల్‌కతాలో భార్య, తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ఎందుకైనా మంచిదని తల్లిదండ్రులను సొంతగ్రామమైన బైద్యబతిలో వదిలిపెట్టాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో.. మళ్లీ తల్లిదండ్రులను ఇంటికి తీసుకొచ్చాడు. అయితే ఈ విషయం అతడి భార్యకు నచ్చలేదు. వారి వల్ల కరోనా వైరస్‌ వస్తుందని ఆమెకు భయం పట్టుకుంది. వారిని తీసుకురావద్దని ముందే చెప్పింది. అయినప్పటికి మజుందర్‌ ఆమె మాటను వినకుండా తల్లిదండ్రులను తీసుకొచ్చాడు. దీంతో భార్య చిత్రహింసలు మొదలు అయ్యాయి. చెంపదెబ్బలు కొట్టడం, సిగరెట్లతో కాల్చడం వంటివి చేసేవి. రోజు రోజుకు భార్య చిత్రహింసలు ఎక్కువ అయిపోతుండడంతో భార్యపెట్టే చిత్రహింసలను ఆమెకు తెలియకుండా వీడియో రికార్డ్‌ చేశాడు. ఆతరువాత భీదాన్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించాడు.

తన భార్య తనకం నరకం చూపెడుతోందని, రోజు చిత్రహింసలు పెడుతోందని బాధని మొత్తం పోలీసులకు చెప్పాడు. భార్యపై గృహ హింస కింద కేసు నమోదు చేయాలని కోరాడు. పోలీసులు చిన్న కంప్లైట్‌ రాసుకుని పంపించి వేశారు. పోలీసులు తనకు న్యాయం చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. అతడు రికార్డు చేసిన వీడియో ప్రస్తుతం నెటింట్లో వైరల్‌గా మారింది.

Next Story
Share it