సికింద్రాబాద్‌లో భారీ చోరీ..!
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 13 Nov 2019 1:15 PM IST

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది. మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో రోహిత్, నవకార్ నగల దుకాణాలు ఉన్నాయి. రోహిత్ నగల దుకాణంలో బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటారు. వీరి వద్ద నుంచి నవకార్ నగల దుకాణం ఆభరణాలు కొనుగోలు చేస్తుంటుంది. ఆభరణాల లెక్కలకు సంబంధించిన రూ.30 లక్షల నగదును తీసుకుని రోహిత్ నగల దుకాణానికి చెందిన రూపారామ్ అనే వ్యక్తి నవకార్ నుంచి తన దుకాణానికి బయలుదేరాడు. ఈ క్రమంలో నవకార్ నగల షాపు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రూపారామ్‌పై పెప్పర్ స్ర్పే చల్లి అతని వద్ద ఉన్న నగదును తీసుకుని బైక్‌పై పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Next Story