నార్వేలో ఏం జరిగింది..? కెమెరాకు చిక్కిన దృశ్యం..!
By సుభాష్ Published on 9 Jun 2020 12:06 PM ISTఉత్తర నార్వేలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. అనేక ఇళ్లు సముద్రంలో నేలమట్టం అయ్యాయి. చాపకింద నీరులా ఇండ్లన్నింటిని సముద్రం తనలో కలిపేసుకుంది. ఈ విషాద ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియోను అల్టా నివాసి అయిన జాన్ ఫ్రెడ్రిక్ డ్రాబ్లోస్ ట్విటర్‌లో షేర్ చేశాడు. 'కొండచరియలు, భారీ బురదజల్లు అనేక ఇళ్లను సముద్రంలోకి లాగుతున్నాయి' అనే టైటిల్ జోడించి పోస్టు చేశాడు.
రెండు నిమిషాల పాటు ఈ వీడియోను పోస్టు చేశాడు. ఆ తర్వాత బాగా గమనించినట్లయితే ఇళ్లన్నీ కదులుతున్నట్లు అనిపిస్తుంది. కొంత సేపు తర్వాత ఇళ్లన్నీ సముద్రపు నీటిలో కలిసిపోయాయి. అయితే ఇదంతా నిజామేనా..? లేక గ్రాఫిక్ మాయనా అనే అనుమానం వస్తుంది. కానీ ఇది నిజం. ఇది చాలా శక్తివంతమైనది. అనేక ఇళ్లను సముద్రంలోకి లాగేసుకుంది. సీసీ పుటేజీలో బయటపడ్డ ఈ వీడియో సోషల్ మీడియాలో తెర వైరల్ అవుతోంది.
కాగా, ఈ కొండచరియ 800 మీటర్ల పొడవు, 40 మీటర్ల ఎత్తులో ఉంది.. అని డైలీ మెయిల్ నివేదించింది. ఈ వీడియో పోస్టు చేసిన కొద్దిసేపట్లోనే 3.5 మిలియన్లకుపైగా వ్యూస్ రాగా, ప్రస్తుతం 7.1 మిలియన్ వరకూ చేరింది.
�