సికింద్రాబాద్‌లో చోరీ ఎలా జరిగింది? ఎంత బంగారం దోచుకున్నారు?
By న్యూస్‌మీటర్ తెలుగు
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో భారీ చోరీ జరిగింది. మల్లికార్జునగర్‌లోని తాళాలు వేసి ఉన్న ఇంట్లో దాదాపు 3.5 కిలోల బంగారు ఆభరణాలు, రూ.18 లక్షల నగదును దొంగలు అపహరించుకుపోయారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు చోరీకి పాల్పడ్డారు. సరళ దంపతులు వడ్డీ వ్యాపారం చేస్తూ.. భారీగా ఆభరణాలు, నగదు కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న డబ్బు, నగలును అందినకాడికి దోచుకొని దొంగలు పరారయ్యారు. పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు చోరీకి గురికావడంతో సరళ దంపతులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని బేగంపేట ఎసీపీ రామ్‌రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్ అంజయ్య పరశీలించారు. దొంగతనం జరిగిన తీరుపై క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. దొంగతనం ఇంట్లో వారి పనా లేక బయట వారు ఎవరైనా వచ్చి చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.