ఇలా చేస్తే షుగర్ వ్యాధి ఎప్పుడూ అదుపులో ఉంటుంది
By సుభాష్ Published on 14 April 2020 2:14 AM GMTదేశంలోఅనారోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. మనం తీసుకునే ఆహారం, నిద్రలేమి, పని ఒత్తిడి, మానసిక సమస్యలు, అతిగా ఆలోచించడం వివిధ కారణాల వల్ల మన అరోగ్యాన్ని మనమే పాడుచేసుకుంటున్నాము. ప్రస్తుతం మధుమేహం వచ్చిన వారి సంఖ్య కూడా చాలానే పెరిగిపోతున్నారు. ఈ షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉండాలంటే కొన్ని ఇంటి చిట్కాలతోనే అదుపులో పెట్టుకోవచ్చు. దీంతో అనారోగ్యం బారిన పడకుండా ఉంటాము. అదే మన ఇంట్లో బిర్యానీ ఆకు. దీని వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నమాట.
సాధారణంగా బిర్యానీ ఆకును ఇంట్లో వంటకాల్లో మాత్రమే వాడుతుంటారు. బిర్యానీ వాసన కోసం వాడే ఈ ఆకుల్లో ఎన్నో ఆరోగ్య గుణాలున్నాయని చెబుతున్నారు వైద్యులు. శ్వాస కోస వ్యవస్థ సంబంధిత వ్యాధుల బారిన పడేవారు వంటకాల్లో బిర్యానీ ఆకును తరుచూ తీసుకుంటే నయం చేసుకోవచ్చు. ఇన్‌ప్లమేషన్‌కు కారణమయ్యే ఇంటర్‌ల్యూకిన్ అనే ప్రోటీన్లను వాధి నిరోధక వ్యవస్థను అతి తక్కువ పరిణామాల్లో విడుదల చేస్తుంటుంది. ఇందుకోసం బిర్యానీ ఆకు తరుచూ తీసుకుంటే ఈ ప్రోటీన్ విడుదల తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారికి బిర్యానీ ఆకు ఎంతో ఉపయోపడుతుంది. బిర్యానీ ఆకులను కాషాయంలా తయారు చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుందట.
డయాబెటిస్ ఉన్న వారు ఇలా చేయండి
ఒక పాత్రలో పది బిర్యానీ ఆకులను తీసుకుని, అందులో మూడు గ్లాసులు నీళ్లు పోసుకుని సుమారు పది నిమిషాల పాటు బాగా మరిగించాలి. తర్వాత స్టవ్ పై నుంచి దించేసి పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత అందులో ఉన్న ఆకులను తీసేసి గ్లాసు చొప్పున రోజుకు మూడుసార్లు అలాగే ఉదయం బ్రేక్ పాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనానికి గంట ముందు కాషాయం తాగితే మంచి ఫలితాలుంటాయట. ఇలా వరుసగా మూడు రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాలి. మళ్లీ రెండు వారాల తర్వాత మూడు రోజులు ఇలా బిర్యానీ ఆకుల కషాయం తాగితే షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇలా చేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్దికరించి షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల గుండె వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. క్యాన్సర్ వ్యాధి రాకుండా అడ్డుకట్టవేసేందుకు ఎంతో ఉపయోగపడుతుంది