అక్కడ మోదీ 'మెనూ' కూడా ప్రత్యేకమే.. !

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Sep 2019 7:43 AM GMT
అక్కడ మోదీ మెనూ కూడా ప్రత్యేకమే.. !

అమెరికా: మోదీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రత్యేకమే. ఆయన మాట్లాడే దగ్గర నుంచి నడవడిక వరకు ప్రత్యేకంగానే ఉంటుంది. అమెరికా పర్యటనలో మోదీ 'హౌదీ మోదీ' కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారం రోజులపాటు అమెరికాలో ఉండే మోదీ కోసం నిర్వాహకులు ప్రత్యేక మెనూ సిద్ధం చేస్తున్నారు. భారత సంతతికి చెందిన హుస్టన్ చెఫ్ కిరణ్ వర్మ ప్రధాని మోదీ కోసం రెండు ప్రత్యేక వంటలను తయారు చేయనున్నారు. నమో తాలి, నమో తాలి మిఠాయి పేరుతో తయారు చేసిన వంటకాలను ప్రధానికి వడ్డించనున్నారు.

ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఆసాంతం ప్రత్యేక మెనూతో వంటకాలను సిద్ధం చేయనున్నారు. ఈ వంటకాలన్నీ స్వచ్ఛమైన దేశీ నెయ్యితో తయారుచేస్తారు. ప్రధాని మెనూలో పలు రకాల పచ్చళ‍్లతో పాటు నమో తాలి మిఠాయిలో రస్‌మలై, గజర్‌ కా హల్వా, బాదం హల్వా, ష్రికండ్‌లు ఉండగా, నమో తాలి సేవ్రిలో కిచిడీ, కచోరీ, మేతి తెప్లా వంటకాలున్నాయి. పలు రాష్ట్రాలు, నగరాల్లో ప్రాచుర్యం పొందిన వంటకాలను ప్రధాని కోసం సిద్ధం చేస్తామని చెఫ్‌ కిరణ్‌ పేర్కొన్నారు. ప్రధాని ఆరగించే పదార్ధాలను సిద్ధం చేయడం తనకు ఇదే తొలిసారని ఆమె తెలిపారు.

Next Story