హుక్కా సెంటర్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది అరెస్ట్..!
By సుభాష్
కొత్త సంవత్సరం సమీపిస్తున్నవేళ అక్రమ దుకాణాలను దాడులు నిర్వహించారు పోలీసులు. పలు హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోఉన్నహుక్కా సెంటర్లపై మెరుపు దాడులు నిర్వహించారు పోలీసులు. ఈసందర్భంగా 40 మంది యువతను అదుపులోకి తీసుకున్నారు. యువతను మత్తులోకి దించి ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్న నిర్వాహకులను కూడా అరెస్టు చేశారు.
నగరంలో ముఖ్యంగా కాలేజీ యువకులను టార్గెట్ చేసుకుని ఓ హుక్కా సెంటర్‌పై గతంలోనూ దాడులు నిర్వహించి కేసులు కూడా నమోదు చేశారు. పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు సెంటర్‌పై దాడి చేశారు. ఈ హుక్కా సెంటర్‌లో ప్రమాదకరమైన ప్లేవర్‌లత్ మత్తు పదార్ధాలను అమ్మతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 40 హుక్కా తాగే పరికరాలు, 30 హుక్కా ప్లేవర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో మైనర్లు కూడా ఉన్నారు. దీంతో వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పోలీసులు పేర్కొన్నారు.