హనీట్రాప్‌: బట్టబయలైన ఎమ్మెల్యేలు.. మాజీ మంత్రుల రాసలీలలు..!

By అంజి  Published on  30 Nov 2019 5:40 AM GMT
హనీట్రాప్‌: బట్టబయలైన ఎమ్మెల్యేలు.. మాజీ మంత్రుల రాసలీలలు..!

కర్నాటకలో ఓ హనీట్రాప్‌ వ్యవహారం గుట్టురట్టయింది. ధనవంతులకు, రాజకీయ నాయకులకు అమ్మాయిలతో ఎరవేసి డబ్బు గుంజేందుకు యత్నిస్తున్న ముఠాను బెంగళూరు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం అనుకన్నదాటి కంటే చాలా పెద్దదేనని పోలీసులు దర్యాప్తులో తేలింది. కర్నాటకలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి రాసలీలలు నెట్టింట్లో వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో తనను ఓ ముఠా బెదిరింపులకు గురి చేస్తోందని ఓ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు హనీట్రాప్‌ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఎమ్మెల్యేల ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ఈ కేసు సంబంధించి ఎనిమిది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ముఠా రాజకీయ నాయకులను ముగ్గులోకి దింపి వారితో ఏకాంతంగా గడిపిన సమయంలో వీడియోలు తీసి కోట్లలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితులు రఘు, పుష్పా, మంజునాథ్‌, పుష్పావతిలను అరెస్ట్‌ చేశామని సీసీబీ విభాగం డీసీపీ కెపీ.రవికుమార్‌ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరి కొంత మందిని విచారిస్తున్నానమని సీసీబీ పోలీసులు తెలిపారు.

నిందితుడు రాఘవేంద్ర అలియాస్‌ రఘు మొబైల్‌ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత ఉద్యోగం వదిలేసిన రఘు.. బెంగళరూకు మాకం మార్చాడు. ఈ క్రమంలో రఘు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ధనవంతులో పరిచయాలు పెంచుకున్నాడు. రఘు తన ప్రియురాలు పుష్పతో పాటు మరి కొంతమంది అమ్మాయిలను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు పరిచయం చేసేవాడు. ప్రస్తుత రాజకీయాల గురించి అధ్యయనం చేయడానికి వచ్చారని, వారికి మీ సహాయం కావాలని రఘు మాయమాటలు చెప్పేవాడు.

హనీట్రాప్‌ ముఠా వెనుక పెద్ద రాజకీయ నాయకులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల నుంచి ఇప్పటికే రూ.కోట్ల రూపాయలను నిందితులు వసూలు చేశారని తెలిసింది. 2015 నుంచి ఈ ముఠా హనీట్రాప్ వ్యవహారాన్ని కొనసాగిస్తోంది. ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ధనవంతులకు వల వేసేందుకు ముఠా మహిళలు వారితో చాట్‌ చేసేవారు. వారు వలపు వలలో చిక్కిన తర్వాత ముఠా సభ్యులు సీక్రెట్‌గా వారి రొమాన్స్‌ వీడియోలను రికార్డు చేసేవారు. రఘు ఇంట్లో సీసీబీ పోలీసులు తనిఖీలు చేశారు. పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు, సీక్రెట్‌ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హనీట్రాప్‌ వ్యవహారంపై బెంగళూరు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Next Story