ఆర్టీసీ కార్మికులకు హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మద్దతు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Oct 2019 12:03 PM GMT
ఆర్టీసీ కార్మికులకు హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మద్దతు

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె 21వ రోజుకు చేరుకుంది. అయితే నిన్నసీఎం కేసీఆర్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రెస్‌ మీట్‌లో స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ ఆర్టీసీ జేఏసీ అధ్యక్షులు అశ్వత్థామరెడ్డి, ఇతర కార్మిక నేతలు..కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్ని బెదిరింపులు చేసినా..ఏ ఒక్క కార్మికుడు విధులకు హాజరుకాలేదన్నారు. అయితే సీఎం తన స్థాయి తగ్గి కార్మికులను విమర్శించడం సభ్య సమాజం మొత్తం గమనించిందన్నారు.

అయితే నిన్న కేసీఆర్‌ వ్యాఖ్యలకు తీవ్ర మనస్తాపం చెందిన..మరో ఆర్టీసీ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందినట్లు తెలియజేశారు. ఆర్టీసీ కార్మికులకు మీ నుంచి మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే కేసీఆర్‌ ప్రభుత్వానికి ముందుంది ముసళ్ల పండుగా అని చెప్పారు. కార్మిక సంఘాలు కోరిక మేరకు వారితో వెంటనే చర్చలు జరిపితే మంచిదని సూచించారు. సీఎం తీరుపై కార్మికులకు తాను అన్ని విధాలుగా సహకరిస్తానని హోం శాఖ సహాయ మంత్రి హమీ ఇచ్చారు. కానీ కార్మికులు ఎలాంటి ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు.

Next Story