'రంగుల హోళీ' వెనక అసలు నిజాలు..

By అంజి  Published on  10 March 2020 3:49 AM GMT
రంగుల హోళీ వెనక అసలు నిజాలు..

ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సహంగా ప్రతి ఒక్కరూ హోళీ పండుగ జరుపుకుంటూ ఉంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందంగా రంగులు పూసుకుంటారు. హోళీ పండుగ రోజు రసాయనాలతో తయారు చేసిన రంగులు చల్లుకోవడం వల్ల చాలా మంది తమ కళ్లను కోల్పోతున్నారు. చర్మ వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. హోళీ రోజు మనం ఒంటికి పూసుకునే రంగులు నిజంగానే చల్లదనాన్ని ఇస్తున్నాయా? అంటే ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి నెలకొంది. వేసవి కాలానికి స్వాగతం పలుకుతూ.. చలికాలని వీడ్కొలు పలుకుతూ మనం ఆనందంగా రంగులు చల్లుకుంటూ జరుపుకునే పండుగే హోళీ. ఆట పాటలతో ఉత్సహంగా హోళీ అందరూ హోళీ జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం లో పౌర్ణిమ రోజు హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగని సత్యయుగం నుంచి జరుపుకుంట్టున్నట్టుగా హిందూ పురాణాలలో వివరించబడింది. హోళీ అంటే అగ్ని, అగ్నిచే పునీతమైనది అనే అర్ధాలు చెప్పబడ్డాయి. హోళీ పండుగకు 15 నుంచి నెల రోజుల ముందు పూసే మోదుగ పూలతోనే ప్రకృతి సిద్ధమైన రంగులను గిరిజనులు తయారు చేస్తుంటారు. అయితే ఈ పూలు హోళీ పండుగ తర్వాత పూయకపోవడం విశేషం. మోదుగుపూలతో తయారు చేసిన రంగులతో హోళీ జరుపుకుంటే చాలా మంచిదని పెద్దలు అంటుంటారు. సంప్రదాయమైన రంగులను తయారుచేయుటకు మోదుగ పూలను ఉపయోగిస్తారు. రసాయనాలతో తయారు చేసిన రంగులను చల్లుకోవడం వల్ల చర్మ వ్యాధులు వస్తుంటాయి.

ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో హోళీ పండుగ అనేది లేదు. శ్రీరామనవమి వసంతం చల్లుకుంటారు. ఇదే సమయంలో ఉత్తర భారతదేశంలో హోళీగా జరుపుకుంటారు. అయితే మన వాళ్లు మాత్రం వసంతాన్ని మరిచిపోయి హోళీ పండుగను గుర్తు పెట్టుకున్నారు. ప్రాథమిక పరిశోధనల ప్రకారం 7 శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోళీ పండుగ ఉత్సవాలు జరుపుకొన్నారని తెలిసింది. వాస్తవంగా హోళీ పండుగకు సంవత్సరం పొడవునా ఆచారాలు ఉంటాయి, మొదటగా రంగు పొడిని ఒకరికొకరు పూసుకుంటారు , పొడవైన చిమ్మే గొట్టాలు లేదా చిమ్మే తుపాకుల నుండి రంగు నీటిని జల్లుకుంటారు. ఈ పండుగను చాలా రోజుల ముందుగానే 'హోళీ మిలన్' లేదా బైతక్స్ ద్వారా జరుపుకొన్నారు. వసంత కాలంలో వాతావరణములో మార్పూలు జరగటం వల్ల వైరల్ జ్వరం, జలుబు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం. వసంత కాలములో రంగులను ఇచ్చిన వృక్షాలు చనిపోతే వాటికి ప్రత్యామ్నాయంగా భారత దేశంలోని పట్టణ ప్రాంతాలలోని ప్రజలు రసాయనాలు ఉపయోగించి తయారుచేసే రంగులను వాడుతున్నారు.

హోళీపై కరోనా ప్రభావం..

ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ఇప్పటికే 90 దేశాలకు పైగా వ్యాపించింది. భారత్‌లో ఇప్పటికే 34 పాజిటివ్‌ కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో హోళీ పండుగు జరుపుకొవద్దని పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నారు. హోళీ పండుగ రోజు రంగులు ఒకరి మీది మరోకరు చల్లుకోవడం వల్ల వైరస్‌ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా లేకపోలేదు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం.. తాను ఈ సంవత్సరం హోళీ వేడకలకు దురంగా ఉంటున్నాని పేర్కొన్నారు. హోళీ పండుగను ప్రజలు జరుపుకోకుండా ఉండేందుకు బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు పిలుపునిచ్చింది.

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో హోళీ ఆడొద్దని ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు సూచించారు. గుమిగూడి హోళీ వేడుకలు జరుపుకుంటే వైరస్‌ సోకే ప్రమాదం ఉందని ఎయిమ్స్‌ వైద్యుల తెలిపారు.

Next Story